భారతదేశం, ఆగస్టు 4 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 586 పాయింట్లు పడి 80,600 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 203 పాయింట్లు కోల్పోయి 24,565 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 344 పాయింట్లు పడి 55,618 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2821.45 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2718.41 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,400- 24,350 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. అది బ్రేక్​ అయితే, సూచీ మరింత దిగువకు పడొచ్చు. 24,900- 24,950 లెవల్స్​ రెసిస్టెన్స్​గా ...