భారతదేశం, ఏప్రిల్ 21 -- ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌ దారుణాలు ఆగడం లేదు. వరుస ఘటనలు జరుగుతున్నా, వాటిని కట్టడి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా బలవన్మరణాలు మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో బెట్టింగ్ యాప్స్‌ వలలో చిక్కి యువకులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ యాప్స్‌ ఉచ్చులో చిక్కుకుని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్స్‌లో ఆటల్లో చిక్కుకుని రూ.6 లక్షల వరకు అప్పులు చేసిన యువకుడు వాటిని తీర్చే మార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చేసిన అప్పుల్ని తీరుస్తామని భరోసా ఇచ్చినా తల్లిదండ్రులకు భారంగా మారాననే ఆవేదనతో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.

సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ యాప్స్‌ వలలో చిక్కిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ము...