భారతదేశం, ఫిబ్రవరి 6 -- విశాఖపట్నానికి చెందిన పంచాయతీరాజ్ విభాగం రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో అతనికి సంబంధించిన పలుచోట్ల సోదాలు నిర్వహించగా. భారీగా ఆస్తులు బయటపడ్డాయి.

నెల రోజుల కిందంటే రిటైర్డ్ అయిన సూపరిండెంటింగ్ ఇంజినీర్(ఎస్‌ఈ) కల్లేపల్లి శ్రీనివాసరావు ఇళ్లపై ఏకకాలంలో 5 చోట్ల గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధురవాడలోని నివాసంతో పాటు సాలూరు, హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.

ఈ సోదాల్లో మరో 5 బ్యాంక్ లాకర్ల తాళాలు చిక్కాయి. వీటిని ఇవాళ తెరిచేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. వీటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని తెలుస్తోంది.దాదాపు రూ.30 కోట్ల వ...