భారతదేశం, సెప్టెంబర్ 26 -- భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాల పాటు వెన్నెముకగా నిలిచిన తొలి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్ అయిన మిగ్​ 21 విమానం.. శుక్రవారం చివరిసారిగా గగనతలంలోకి ఎగరనుంది. దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన ఈ యుద్ధ విమాన సేవలకు నేటితో ముగింపు పడనుంది. మిగ్​ 21 స్క్వాడ్రన్ నుంచి మిగిలిన చివరి జెట్‌లకు, ఈ విమానాన్ని మొట్టమొదటగా చేర్చుకున్న చండీగఢ్‌లోని ఎయిర్ బేస్‌లోనే అంగరంగ వైభవంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.

శుక్రవారం, "పాంథర్స్" అని పిలిచే స్క్వాడ్రన్ నంబర్ 23 నుంచి మిగ్​ 21 చివరి బ్యాచ్​ విమానాలు చండీగఢ్‌లో జరిగే డీకమిషనింగ్ వేడుకలో పదవీ విరమణ చేయనున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ ...