భారతదేశం, జనవరి 25 -- పుష్ప సినిమాలో వచ్చిన స్టార్ డమ్ ను కొనసాగించే ప్లాన్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో.. ఇప్పుడు రాబోయే సినిమాల విషయంలోనూ ఎంతో ప్లాన్ గా సాగిపోతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్. వరుసగా నాలుగు సినిమాలను టాప్ డైరెక్టర్లతో చేస్తున్నాడు.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడు తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకరైన అట్లీతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇదో సూపర్ హీరో సినిమా అనే టాక్ ఉంది. ఈ మూవీకి ఏఏ22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది.

అట్లీతో సినిమా తర్వాత అల్లు అ...