భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- గేట్​ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు (సెప్టెంబర్ 28, 2025, ఆదివారం) చివరి రోజు. ఆలస్య రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు పోర్టల్‌ను (gate2026.iitg.ac.in) సందర్శించాలి.

దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.

దీనితో పాటు ఆలస్య రుసుముతో రిజిస్టర్ చేసుకోవడానికి గడువు అక్టోబర్ 9న ముగుస్తుందని ఐఐటీ గువాహటి తెలిపింది.

ఐఐటీ గువాహటి ఆధ్వర్యంలో గేట్ 2026 పరీక్షను 2026 ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాన్ని 2026 మార్చి 19న ప్రకటించనున్నారు.

గేట్ 2026కు దరఖాస్త...