భారతదేశం, ఆగస్టు 13 -- బ్యాంకు పనుల కోసం వెళ్లాలని ప్లాన్​ చేస్తున్న వారికి ముఖ్య గమనిక! ఎల్లుండి, అంటే ఆగస్ట్​ 15 నుంచి బ్యాంకులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం, కృష్ణాష్టమి, ఆదివారం ఇందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి వంటి జాతీయ, ప్రాంతీయ పండుగలతో పాటు, వారపు సెలవులు కలుపుకుని మొత్తం 15 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతి నెలా మాదిరిగానే, ఈ నెలలో కూడా రెండొవ, నాల్గొవ శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి.

అయితే, ప్రాంతీయ, స్థానిక అవసరాలను బట్టి రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల్లో మార్పులు ఉంటాయి. అందుకే ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు లేదా లాంగ్ వీకెండ్స్ కోసం ముందుగానే మీ దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించడం మంచిది.

ఆగ...