భారతదేశం, జూలై 31 -- నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2025ను నేడు, జులై 31 2025న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​) విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్​ పీజీ)కు హాజరయ్యే అభ్యర్థులు ఎన్​బీఈఎంఎస్​ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్టు 3, 2025న ఒకే షిఫ్ట్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్షలో 200 మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్​ ఉంటాయి. వాటిలో సరైన/అత్యుత్తమ/అత్యంత సముచితమైన సమాధానాన్ని అభ్యర్థులు ఎంచుకోవాలి.

నీట్​ పీజీ ప్రశ్నాపత్రం ఐదు సమయ-పరిమిత విభాగాలలో (గ్రూప్ ఏ, బీ, సీ, డీ, ఈ) విభజించారు. ఎంబీబీఎస్​ సి...