భారతదేశం, జూలై 21 -- బ్యాంకు పనుల కోసం తిరిగే వారికి అలర్ట్​! తెలంగాణలో నేడు, జులై 21 అన్ని బ్యాంకులకు సెలవు. బోనాల నేపథ్యంలో జులై 21ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఇందుకు కారణం. ఈ రోజు బ్యాంకులతో పాటు స్కూళ్లు, కాలేజీలు సైతం మూతపడి ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) జారీ చేస్తుంది. అయితే వీటిల్లో ప్రాంతీయ పండుగల వేళ ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు, జులై 21న బోనాల కారణంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఇక జులై 20 ఆదివారం వచ్చింది. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే, తెలంగాణలో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు లభించాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఇక హైదరాబాద్​లోని పలు ఆలయాలకు భక్తులు పోటె...