భారతదేశం, ఆగస్టు 7 -- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియను ఆగస్టు 7, 2025 అంటే, నేటితో ముగించనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ ప్రాంతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7, 2025

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 9, 2025

దరఖాస్తు సవరణ విండో: ఆగస్టు 10 నుంచి ఆగస్టు 19, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

వయస్సు: ఆర్​ఆర్బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​లో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాలు, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

మొత్తం ఖాళీలు: ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంస్థలో మొత్తం 6,238 టెక్నీషియన...