భారతదేశం, డిసెంబర్ 28 -- రామ మందిర దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యకు బయల్దేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లో దర్శనం చేసుకోనున్నారు. రామ మందిరాన్ని దర్శించుకునేందుకు చంద్రబాబు నాయుడు ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి అయోధ్యకు బయలుదేరారు.

ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో దాదాపు మూడు గంటలు గడిపనున్నారు. ఆ తర్వాత తిరిగి విజయవాడకు తిరిగి వస్తారు. గతేడాది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు. ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....