భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి డిజిటల్ అసిస్టెంట్‌గా మారిన 'ChatGPT' తాజాగా అమెరికాలో మొరాయించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వేలాది మంది యూజర్లకు ఈ చాట్‌బాట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా కొత్తగా ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించిన వారికి ఎర్రర్ మెసేజ్‌లు రావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్‌డిటెక్టర్' (Downdetector) నివేదిక ప్రకారం మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల మధ్య (ఈస్టర్న్ టైమ్) ఫిర్యాదులు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. దాదాపు 12,500 మందికి పైగా యూజర్లు తమకు సర్వీస్ అందడం లేదని రిపోర్ట్ చేశారు. అయితే కొద్ది గంటల తర్వాత ఈ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

ఈ సాంకేతిక లోపంపై ChatGPT మాతృ సంస్థ OpenAI స్పందించింది. తమ అఫీషియల్ స్టేటస్ పేజీలో 'ఫైన్ ట్యూనింగ్ జాబ్స్...