భారతదేశం, మే 26 -- మధ్యప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఓ గిరిజన మహిళపై అత్యంత కృరంగా ప్రవర్తించారు. ఆమెను గ్యాంగ్​ రేప్​ చేసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

మధ్యప్రదేశ్​ ఖాండ్వా జిల్లాలో జరిగింది ఈ ఘటన. 20 ఏళ్ల వయసున్న ఇద్దరు.. 45ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను హరి రామ్ కోర్కు (27), సునీల్ కోర్కు (26)గా గుర్తించినట్టు డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ జనరల్ సిద్ధార్థ్ బహుగుణ తెలిపారు. మహిళ ప్రైవేట్ పార్ట్స్, గర్భాశయానికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

గాయాల తీవ్రత, అవి ఎలా సంభవించాయో తెలుసుకోవడానికి అధికారులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

శుక్రవారం రాత్రి ఓ వివాహానికి హాజరైన తర్వాత హరి రామ్ కోర్కు ఇంట్లో ఆమెపై అత్యాచారం జరిగిందని అదనపు పోలీసు ...