భారతదేశం, జనవరి 30 -- మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7నే ఈ సినిమా రానుంది. ఈ విషయాన్ని రాజమౌళియే అనౌన్స్ చేశాడు. కాశీలో హోర్డింగ్స్ పై ఈ సినిమా రిలీజ్ డేట్ నే లీక్ చేశారని వార్తలు వచ్చిన మరుసటి రోజే అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఎంతగానో ఎదురు చూస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7నే రానున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో ఓ ఉల్క వచ్చి భూమిని ఢీకొడుతున్నట్లుగా ఉంది. అది నంబర్ 7 రూపంలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా అదే రోజు రిలీజ్ అవుతున్నట్లు రాజమౌళి చెప్పాడు.

నిజానికి వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రానున్నట్లు కాశీలో హోర్డింగ్స్ వెలిసిన విషయం తెలిసిందే. ఇందులో మూవీ పేరు లేకపోయినా...