భారతదేశం, జూన్ 2 -- ఈ మధ్య కాలంలో ప్రజలు క్రెడిట్​ కార్డుపై అధికంగా ఆధారపడుతున్నారు. బ్యాంకులు కూడా 'టార్గెట్​' పేరుతో ప్రజలకు క్రెడిట్​ కార్డులు ఆఫర్​ చేస్తూ వెళుతున్నాయి. వాస్తవానికి క్రెడిట్​ కార్డు ఉండటం, దానిని వాడటం తప్పు కాదు! కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోవడం తప్పు. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకుంటూ వెళితే, ఏదో ఒక రోజు మనకే నష్టం కలుగుతుంది. ఆర్థిక భారం పెరిగిపోతుంది. అందుకే, మన మీద ఆర్థిక భారం పడకుండా.. మనం అప్పుల్లో కూరుకుపోకుండా ఉండాలంటే, క్రెడిట్​ కార్డును వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, టిప్స్​ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి..

ప్రతి నెలా మీ గడువు తేదీలోగా మీ పూర్తి క్రెడిట్ కార్డు బ్యాలెన్స్​ని చెల్లించాలి. మీ గోల్​ అధిక వడ్డీ రేట్లను నివారించడానికి మాత్రమే కాదు.. మీ క్రెడిట్ స్కోర్ కూడా కాపాడుకోవడ...