భారతదేశం, సెప్టెంబర్ 20 -- అప్పులు ఒక మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఊహించడం కష్టం. అప్పుల భారం తట్టుకోలేక కొందరు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు ఆ అప్పులు తీర్చకుండా తప్పించుకోవడానికి తమ చావును నటిస్తుంటారు. ఇలాంటి ఒక విచిత్రమైన, అసాధారణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగింది.

ఒక వ్యక్తి రూ.1.40 కోట్ల అప్పుల నుంచి తప్పించుకోవడానికి తన సొంత మరణాన్ని ఫేక్​ చేశాడు! తన కారును కాళిసింధ్ నదిలో తోసేసి, తాను చనిపోయినట్లు నమ్మించాడు. అయితే, అతడి మృతదేహం ఎంత వెతికినా దొరకలేదు. చివరికి మహారాష్ట్రలో అతడు పట్టుబడ్డాడు. అప్పుడు.. తాను అప్పులు మాఫీ చేయించుకోవడానికి ఇలా చేశానని, తాను చనిపోయినట్లు నిరూపించడానికి ఈ నాటకం ఆడానని ఒప్పుకున్నాడు.

ఇలాంటి పరిస్థితి మనకి ఎదురవ్వకూడదంటే.. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండటానికి కొన్ని...