భారతదేశం, ఫిబ్రవరి 10 -- మధ్యప్రదేశ్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది! ఓ పెళ్లిలో అప్పటివరకు సరదగా డ్యాన్స్​ చేస్తున్న 23ఏళ్ల మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది! గుండెపోటు కారణంగా కొన్ని క్షణాల్లోనే మరణించింది. కొన్నేళ్ల క్రితం ఆమె సోదరుడు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

మధ్యప్రదేశ్​ విదిషలో ఈ ఘటన జరిగింది. ఇండోర్​కి చెందిన పరినిత జైన్​.. తన బంధువు పెళ్లికి వెళ్లింది. హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఆమె 200 మంది అతిథుల సమక్షంలో డ్యాన్స్​ చేయడం మొదలుపెట్టింది. అప్పటివరకు అంతా బాగానే ఉంది! కానీ ఆ వెంటనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

డ్యాన్స్​ చేస్తున్న పరినిత జైన్​ ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. అప్పటివరకు చప్పట్లు, కేరింతలతో నిండిపోయిన ఆ ప్రాంగణాన్ని మౌనం కప్పేసింది. కొందరు పరినిత దగ్గరికి పరిగెత్తారు.

వేడుకల్లో పాల్గొన్న కొందరు డా...