Hyderabad, జూలై 16 -- కింగ్డమ్.. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ రిలీజెస్ లో ఒకటి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 16) ఓ అదిరిపోయే మెలోడీ అన్నా అంటేనే అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులోని లిరిక్స్, మ్యూజిక్ మనసుకు హత్తుకునేలా సాగింది. మరి ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం చూడండి.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. తాజాగా రిలీజైన ఎమోషనల్ మెలోడీ సాంగ్ ను అనిరుధే పాడటం విశేషం. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ అయింది. ఈ సాంగ్ ప్రోమోను ఒక రోజు ముందు రిలీజ్ చేయగా.. బుధవారం (జులై 16) పూర్తి సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మూవీలో అన్న...