భారతదేశం, జూలై 19 -- భారత దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గత కొన్నేళ్లుగా అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విషయం. అయితే, దాదాపు మూడేళ్ల వృద్ధి అనంతరం 2025లో నివాస రెంటల్​ మార్కెట్​లో స్థిరీకరణ కనిపించవచ్చని నోబ్రోకర్​ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2025 మొదటి అర్ధభాగంలో చాలా నగరాల్లో రెంటల్​ ఇన్​ఫ్లేషన్​ 7-9% కి తగ్గింది! ఇది 2021- 2024 మధ్య కనిపించిన 12-24% వార్షిక పెరుగుదల నుంచి గణనీయమైన తగ్గుదల.

కొత్త గృహ సరఫరా క్రమంగా మార్కెట్‌లోకి ప్రవేశించడంతో ఈ మార్పు వచ్చిందని, ఇది అద్దెలను విపరీతమైన స్థాయికి పెంచిన డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గిస్తోందని నోబ్రోకర్ తెలిపింది.

అద్దె ద్రవ్యోల్బణం అంటే అద్దెల ఖర్చులు పెరగడం.

"2025 మొదటి అర్ధభాగం కోసం మా విశ్లేషణ అద్దె ద్రవ్యోల్బణంలో మితమైన మా...