భారతదేశం, జూన్ 27 -- షావోమీ తన సరికొత్త క్లామ్‌షెల్ స్టైల్ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ మిక్స్ ఫ్లిప్ 2ను చైనా మార్కెట్​లో తాజాగా ఆవిష్కరించింది. ఒరిజినల్ మిక్స్ ఫ్లిప్ తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్, మునుపటి మోడల్ కంటే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇందులో మరింత శక్తివంతమైన ప్రాసెసర్, ప్రకాశవంతమైన డిస్​ప్లేలు, మెరుగైన కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో మెరుగుపరిచిన బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షావోమీ మిక్స్​ ఫ్లిప్​ 2 విశేషాలను ఇక్కడ చూసేయండి..

మిక్స్ ఫ్లిప్ 2 ఫోల్టెబుల్​ స్మార్ట్​ఫోన్​ క్వాల్కమ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ ఇంటర్నల్​ స్టోరేజ్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత షావోమీ హైపర్‌ఓఎస్ 2 ఇంటర్‌ఫేస్‌తో నడుస్తుంది.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్ష...