భారతదేశం, జూలై 11 -- ఇటలీకి చెందిన ప్రముఖ టూ-వీలర్ బ్రాండ్ వీఎల్ఎఫ్ (వెలోసిఫెరో) ఈ పండుగ సీజన్‌కు భారత దేశంలోకి 'మాబ్​స్టర్​' స్కూటర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తర్వాత భారత్‌లో ఈ బ్రాండ్ విడుదల చేస్తున్న రెండో మోడల్ ఇది! స్పోర్టీ లుక్‌తో పాటు డ్యాష్‌క్యామ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లతో మాబ్​స్టర్​ రాబోతోంది. వీఎల్ఎఫ్‌కు భారతదేశంలో మోటోహౌస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వీరు ఇప్పటికే బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిళ్లను కూడా దేశంలోకి తీసుకువచ్చారు.

వీఎల్ఎఫ్ మాబ్​స్టర్​ పెట్రోల్ ఆధారిత స్కూటర్. యువతను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించారు. ఈ స్పోర్టీ స్కూటర్‌ను ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ అలెస్సాండ్రో టార్టారిని డిజైన్ చేశారు. ఇది హై-పర్ఫార్మెన్స్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తోంద...