భారతదేశం, సెప్టెంబర్ 10 -- యాపిల్ సంస్థ తమ 'ఆ డ్రాపింగ్' ఈవెంట్‌లో మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్​ చేసింది. అవి.. వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ ఎస్‌ఈ 3. గత ఏడాది సెప్టెంబర్ 2024లో విడుదలైన వాచ్ సిరీస్ 10 తర్వాత ఇప్పుడు వాచ్ సిరీస్ 11 వచ్చింది. ఇక, వాచ్ ఎస్‌ఈ సిరీస్ మూడు సంవత్సరాల విరామం తర్వాత అప్‌డేట్ అయింది. వాచ్ ఎస్‌ఈ 2 (రెండో జనరేషన్) సెప్టెంబర్ 2022లో వచ్చింది. కొత్త గ్యాడ్జెట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

అమెరికాలో యాపిల్ వాచ్ సిరీస్ 11 ధర 399 డాలర్ల (సుమారు రూ. 35,000) నుంచి మొదలవుతుంది. అయితే భారతదేశంలో మాత్రం దీని ప్రారంభ ధర రూ. 46,900గా నిర్ణయించారు! ఇది 42ఎంఎం, 46ఎంఎం సైజుల్లో లభిస్తుంది. జెట్ బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే అల్యూమినియం కేస్‌లలో కూడా ఈ వాచ్ అందుబాటులో ఉంది. దీనితో పాటు పాలీష్డ్ టైటాని...