భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23, 2025న ప్రారంభంకానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డీల్స్, డిస్కౌంట్లు లభించనున్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటూ, మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే, ఈ సమాచారం మీ కోసమే! ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 30,000 లోపు ధరలో లభించే, కెమెరా ఫీచర్‌కు ప్రాధాన్యత ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. నథింగ్, వివో నుంచి రియల్‌మీ వరకు, మీరు పరిగణించదగిన ఐదు స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్​ ఇక్కడ ఉన్నాయి..

1. రియల్‌మీ 15 ప్రో 5జీ:

ఇది రియల్‌మీ నుంచి వచ్చిన లేటెస్ట్ కెమెరా ఫోన్. దీనికి "ఏఐ పార్టీ" ఫోన్‌గా కూడా మంచి పేరుంది! రియల్‌మీ 15 ప్రో 5G డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ అ...