భారతదేశం, సెప్టెంబర్ 28 -- భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​) పథకం అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ మద్దతుగల పొదుపు పథకాల్లో ఒకటి. ఇది ఖాతాదారులకు తక్కువ రిస్క్‌తో, మంచి వడ్డీతో, పన్ను రాయితీతో కూడిన దీర్ఘకాలిక పొదుపు అవకాశాన్ని కల్పిస్తుంది.

ఎక్కువ జోక్యం లేకుండా తమ డబ్బును దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారు, తక్కువ రిస్క్, ఎక్కువ రాబడి, తక్కువ పన్ను ప్రయోజనాలు ఉండే పెట్టుబడి మార్గాల కోసం చూస్తూ సాధారణంగా పీపీఎఫ్ ఖాతా తెరుస్తారు.

దేశ పౌరులు తమ బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయిన పొదుపును (సేవింగ్స్‌) సహేతుకమైన రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడాన్ని ప్రోత్సహించడానికి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పీపీఎఫ్ స్కీమ్​ని ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.1%గా ఉందని అధికారిక గణాంకాలు చెబ...