భారతదేశం, ఆగస్టు 12 -- ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కేటీఎం.. భారతదేశంలో తన కొత్త ఎంట్రీ-లెవెల్ బైక్​ని విడుదల చేసింది. ఈ కొత్త బైక్ పేరు కేటీఎం 160 డ్యూక్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.85 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఆస్ట్రియాకు చెందిన కేటీఎం నుంచి వచ్చిన అత్యంత సరసమైన బైక్‌గా నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఇండియాలో విక్రయిస్తున్న 200 డ్యూక్ మోడల్ కంటే ఇది తక్కువ ధరలో లభిస్తుంది. ఈ కొత్త బైక్ యమహా ఎమ్‌టీ 15 వీ2కి గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం కేటీఎం ఇండియా లైనప్‌లో 1390 సూపర్ డ్యూక్ ఆర్, 890 డ్యూక్ ఆర్, 390 డ్యూక్, 250 డ్యూక్, 200 డ్యూక్ వంటి బైక్‌లు ఉన్నాయి. గతంలో 125 డ్యూక్ కూడా అందుబాటులో ఉండేది కానీ మార్చ్​ 2025లో దాని అమ్మకాలను నిలిపివేశారు. ఇప్పుడు కొత్తగా 160 డ్యూక్ ఈ లైనప్‌లో చేరింది. ఇది కేవలం ఒక సాధారణ మోటార్‌సైకిల్ కాద...