భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్​) త్వరలోనే ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ప్రిలిమినరీ పరీక్ష2025 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్ట్​ 23, 24 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఐబీపీఎస్​ పీఓ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ibps.inలో చూసుకోవచ్చు.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్​ ఫలితాలను తెలుసుకోవడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్​తో పాటు తమ పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.

స్టెప్​ 1- ముందుగా, ఐబీపీఎస్​ అధికారిక వెబ్‌సైట్ ibps.in ను ఓపెన్​ చేయండి.

స్టెప్​ 2- అక్కడ కనిపించే "IBPS PO/MT CRP-PO-XV Prelims Result 2025" అనే లింక్‌పై క్లిక్ చేయాలి. (ఫలితాలు విడుదలైన తర్వాతే ఆ లింక్ యాక్టివేట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి).

స్టెప్​ 3- మీ రిజిస...