భారతదేశం, ఏప్రిల్ 22 -- సాధారణంగా పర్సనల్​ లోన్​లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలా అని మన భారీ వడ్డీ రేట్లు ఉన్న లోన్​లు తీసుకుంటే మనపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు అతి తక్కువ వడ్డీకే పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అది జరగడానికి ఏం చేయాలి? అన్నది తెలుసుతోవాలి. తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణ ఒప్పందాన్ని పొందడంలో మీకు సహాయపడే కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

1. అన్నింటికంటే ముందు, రుణం ఆవశ్యకతను గుర్తించండి - అది వివాహానికి ఖర్చు చేయడానికి లేదా ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితికి ఖర్చు చేయడానికి ఉపయోగిస్తున్నారా? అని తెలుసుకోండి.

2. అవసరాన్ని దానిని గుర్తించినట్లయితే, మొత్తం ఖర్చుల ప్రణాళికను రూపొందించండి. మీ ప్రత్యామ్నాయ నిధుల వనరుల ఆధారంగా కొంచెం ఎక్కువ లేదా తక్కువ రుణం తీసుకోవడానికి ప్రయ...