భారతదేశం, జూన్ 15 -- దేశంలో రెపో రేట్లను ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) తగ్గిస్తున్న సమయంలో.. లోన్​లు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది లోన్​ తీసుకుని సొంత ఇంటి కలల్ని నెరవేర్చుకోవాలని ప్లాన్​ చేస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! రెపో రేట్లను ఆర్బీఐ తాజాగా 50 బేసిస్​ పాయింట్లు తగ్గించడంతో హోమ్​ లోన్​లు కూడా దిగొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు, గృహ రుణాలపై అవి అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది..

హోమ్​ లోన్​ తీసుకునే ముందు వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్​ ఫీజు, ప్రీపేమెంట్​ పెనాల్టీలు, లోన్​ టెన్యూర్​, కస్టమర్​ సర్వీస్​ వంటి వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్​ రంగ బ్యాంకుల్లో ఇవి సా...