భారతదేశం, మే 30 -- టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇంటివాడు కాబోతున్న‌ట్లు స‌మాచారం. ప్రియురాలి మెడ‌లో త్వ‌ర‌లో మూడుముళ్లు వేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. అఖిల్ అక్కినేని, జైనాబ్ ర‌వ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్లు చెబుతోన్నారు. జూన్ 6న ఈ జంట పెళ్లిపీట‌లుఎక్క‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి డేట్‌ను మాత్రం ఇటు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబ్ ర‌వ్జీ కుటుంబ‌స‌భ్యులు అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

అఖిల్‌, జైనాబ్ లు డెస్టినేష‌న్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అందులో నిజం లేద‌ని, వీరి పెళ్లి అన్న‌పూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా జ‌ర‌గ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే జ‌రిగింది.

జైనాబ్ ర‌వ్జీతో చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు అఖిల్ అక్కిన...