భారతదేశం, నవంబర్ 28 -- అఖండ 2 సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ వాడిన వాహనాన్ని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజిన్‌తో ఈ వెహికిల్‌ను నిర్మించగా ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినిమాటిక్ లుక్‌ను అందించింది.

పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుందని మేకర్స్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

ఈ వెహికిల్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవీ వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డ...