భారతదేశం, సెప్టెంబర్ 27 -- నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్​)లో.. ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద సంస్కరణలు రాబోతున్నాయి. కొత్త చైర్మన్ శివసుబ్రహ్మణ్యం రామన్‌ నేతృత్వంలో, పెన్షన్ నియంత్రణ సంస్థ (పీఎఫ్​ఆర్​డీఏ) కొత్త పెట్టుబడి ఆప్షన్స్​ని ఆమోదం తెలిపింది. అలాగే, విత్‌డ్రాయల్ (ఉపసంహరణ) నిబంధనలను సులభతరం చేసే ప్రతిపాదనలు కూడా చేసింది. ఈ చర్యలు లక్షలాది మంది భారతీయులు రిటైర్‌మెంట్ కోసం పొదుపు చేసే విధానాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. ఈ కథనంలో, ఎన్​పీఎస్​ నిర్మాణంలో జరుగుతున్న ప్రధాన మార్పులు, అవి సాధారణ పెట్టుబడిదారులపై చూపించే ప్రభావం గురించి చర్చిద్దాము.

అక్టోబర్ 1 నుంచి, పెన్షన్ ఫండ్ మేనేజర్లు (పీఎఫ్​ఎంలు) కొత్త మల్టిపుల్ స్కీమ్స్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఎస్​ఎప్​) కింద కస్టమైజ్డ్ స్కీమ్‌లను ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్‌ల ద్వారా ఈక్విటీల్లో (స్ట...