భారతదేశం, జూన్ 18 -- చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన నూతన బడ్జెట్ ట్యాబ్లెట్ రెడ్ మీ ప్యాడ్ 2 ను భారత్ లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ టాబ్లెట్ సొగసైన డిజైన్, 2.5కె డిస్ప్లే, భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది సరసమైన ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్లను అందిస్తుంది. రెడ్మీ ప్యాడ్ 2 వై-ఫై, సెల్యులార్ వేరియంట్లలో వస్తుంది. ఈ ట్యాబ్ లో సపోర్ట్ స్టైలస్ సదుపాయం ఉంది. ఇది క్రియేటివ్ వర్క్స్ ను వేగవంతం చేస్తుంది.

రెడ్ మీ ప్యాడ్ 2 లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 274 పిక్సల్ డెన్సిటీ, 10 బిట్ కలర్ డెప్త్, 600నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ డిస్ ప్లే లో బ్లూ లైట్ మరియు ఫ్లికర్ ఫ్రీ వ్యూయింగ్ అనుభవం కోసం టియువి రీన్ ల్యాండ్ సర్టిఫికేషన్ ను కూడా పొందింది. మీడియాటెక్ జీ100 అల్ట్రా ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. దీని నిర్మ...