భారతదేశం, ఫిబ్రవరి 2 -- బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు అందం దివి వాద్యా. బిగ్ బాస్ అనంతరం వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది దివి వాద్య. తాజాగా బిగ్ బాస్ దివి కీలక పాత్ర పోషించిన తెలుగు హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ హనీ.

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హనీ సినిమాలో దివితోపాటు సీనియర్ నటుడు రాజా రవీంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన హనీ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజా రవీంద్రపై బిగ్ బాస్ దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో బిగ్ బాస్ దివి వాద్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటగా హీరోయిన్ దివి మాట్లాడుతూ.. "అ...