భారతదేశం, జూన్ 8 -- 'ది రాజా సాబ్' సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‍లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఏకంగా ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీకి వాయిదా పడింది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. టీజర్ డేట్ కూడా ఇటీవలే రివీల్ అయింది. కాగా, ది రాజా సాబ్ సినిమాపై డైరెక్టర్ మారుతి తాజాగా అదిరిపోయే కామెంట్స్ చేశారు.

ది రాజా సాబ్ విషయంలో తన నుంచి, ప్రభాస్ నుంచి అభిమానులు ఏం వస్తుందని అంచనా వేస్తున్నారో.. అంత కంటే ఒకశాతం ఎక్కువే ఇస్తానని మారుతి అన్నారు. జూన్ 16న టీజర్ వస్తుందని, కచ్చితంగా అదిరిపోతుందనేలా మీరే చూస్తారంటూ చెప్పారు. టీజర్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. హైప్‍ను మరింత పెంచేశారు మారుతి.

మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో మారు...