భారతదేశం, ఆగస్టు 5 -- ఒక పూట వంట అవ్వాలంటే కనీసం ఐదారు చెంచాల నూనె కావాల్సిందే. ఇంకేదైనా ప్రత్యేక వంటకం చేస్తే మరింత నూనె వాడతాం. అంత నూనె తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెల్సినా తప్పదు. కానీ చాలా అంటే చాలా తక్కువ, అసలు నూనె అవసరం లేకుండా వండుకోదగ్గ వంటకాలు కొన్నున్నాయి. అవేంటో చూసి, చేసేయండి. వీటిలో కొన్ని మీకు తెల్సినా మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాం.

వంకాయకు ఒక చుక్క నూనె అంతటా రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. పూర్తిగా మగ్గిపోయాక పైతొక్క తీసేసి లోపలి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి లేదా అరచెంచా కారం, ఉప్పు, కచ్చాపచ్చాగ దంచుకున్న వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. అంతే.. వంకాయ బాజా రెడీ అయినట్లే. చపాతీ, అన్నం లోకి అదిరిపోతుంది.

ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ...