ఆంధ్రప్రదేశ్‌, నవంబర్ 29 -- YS Viveka Murder Case 2019 మార్చిలో సొంతింటిలో హత్యకు గురైన వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మార్చాలని వివేకా కుమార్తె, సతీమణి చేసిన విజ్ఞప్తి సుప్రీం కోర్టు సానుకూలంగా తీర్పు వెలువరించింది. పిటిషననర్లు వెలువరించిన అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నాయని అభిప్రాయ పడిన ధర్మాసనం కేసు దర్యాప్తు ఫైల్స్‌ను వీలైనంత త్వరగా జిల్లా కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేస్తూ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు ఏపీలో జరిగితే న్యాయం జరగదని వివేకా కుమార్తె, సతీమణి వ్యక్తం చేసిన ఆందోళన సరైనదనే భావిస్తున్నామని, అ...