భారతదేశం, ఏప్రిల్ 1 -- శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. లింగమయ్య భార్య, ఆయన ఇద్దరు కుమారులు శ్రీనివాసులు, మురళితో జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉగాది పండగ రోజు గుడికి వెళ్లి వస్తుండగా.. దారి కాచిన దుండగులు దాదాపు 20 మంది తమ తండ్రిని దారుణంగా హతమార్చారని వారు జగన్‌కు వివరించారు. హత్యకు సంబంధించిన కారణాలను చెప్పారు. పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని జగన్ లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్యపడొద్దని.. వచ్చే వారం తాను స్వయంగా వస్తానని జగన్‌ చెప్పారు.

అయితే.. గ్రామంలో తమకు రక్షణ లేదని, స్థానిక ఎస్‌ఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. తమను భయాందోళనకు...