భారతదేశం, జనవరి 24 -- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులో, ప్రయోజనాలో ఆశించి రాజీనామా చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని" అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో రాసుకొచ్చారు.
జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. "పార్లమెంటరీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.