భారతదేశం, ఫిబ్రవరి 13 -- ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రేమికుల రోజున అదే రొటీన్ డిన్నర్, సినిమాల ప్లాన్​ బోర్ కొడుతోందా? అయితే మీ భాగస్వామితో కలిసి సరికొత్తగా, థ్రిల్లింగ్‌గా జరుపుకోవడానికి హైదరాబాద్ 'వండర్లా' బంపర్​ ఆఫర్​ని ప్రకటించింది. రొమాన్స్‌కు కాస్త అడ్వెంచర్‌ను జోడిస్తూ వండర్లా ఈ వాలెంటైన్స్​ డే సందర్భంగా జంటల కోసం ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది. అంతేకాదు టికెట్లపై భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది.

"పూలు, చాక్లెట్ల కంటే కలిసి ఆస్వాదించే జ్ఞాపకాలు మిన్న" అని నమ్మే జంటల కోసం వండర్లా ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.

హైదరాబాద్​ వండర్లాలో టికెట్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇవి ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.

టికెట్​ ఫర్​ టూ (11 గంటలు)- దీని వాస్తవ ధర రూ. 3354.2. ఆఫర్​లో దీనిని రూ. 2399.15 కే, అంటే 28శాతం తగ్గింపుతో ...