భారతదేశం, ఫిబ్రవరి 27 -- Woman Murder: భూపాలపల్లి జిల్లాలో గోనె సంచెలో వృద్ధురాలి మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ మేరకు అరెస్టుకు సంబంధించిన వివరాలను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు బుధవారం వెల్లడించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ (70) ఉపాధి కోసం గ్రామంలోని చింత చెట్ల వద్ద చింతకాయలు ఏరుకుని, ఆ చింతపండును సమీపంలోని గర్మిళ్లపల్లిలో అమ్ముకునేది.

రోజువారీలాగే ఈ నెల 19న సాయంత్రం నాలుగు గంటల సుమారులో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తాను సేకరించిన చింతపండును గర్మిళ్లపల్లిలో అమ్మేందుకు వెళ్లగా సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటలు దాటినా వీరమ్మ ఇంటికి రాకపోవడంతో కొడుకులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు.

వీరమ్మ కనిపించకుండా పోవడంతో కుటుంబ...