భారతదేశం, మార్చి 30 -- West Godavari Crime : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఘోర‌మైన సంఘట‌న చోటుచేసుకుంది. త‌న భార్యపై పెట్టిన కేసు ఉప‌సంహ‌రించుకోవాల‌ని యువ‌తికి వివాహితుడు బెదిరింపుల‌కు దిగాడు. ఆపై ఆ యువ‌తిని అత్యాచారం చేసి, వీడియోల చిత్రీక‌రించాడు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే అత్యాచారం చేసిన వీడియోలను సామాజిక మాధ్యమంలో పెడ‌తాన‌ని, అంద‌రికీ పంపిస్తాన‌ని బెదిరింపుల‌కు దిగాడు. అంతటితో ఆగ‌కుండా చంపుతాన‌ని బెదిరించాడు. దీంతో ఆ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం వ‌న్‌టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం భీమ‌వ‌రంలోని వ‌న్‌టౌన్ ప‌రిధిలో ఒక యువ‌తి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇటీవ‌లి ఒక మ‌హిళ‌తో త‌గాదా రా...