భారతదేశం, నవంబర్ 25 -- Wedding Cost: పెళ్లి చేసుకోబోతున్న వారికి, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. రాకుమారుడు రావాలని అమ్మాయి, ఏంజెల్ రావాలని అబ్బాయి కలలు ఒకవైపు, ఆకాశం లాంటి పందిరి వేసి పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులూ ఆశ పడతారు. ఇలా కలలు కనడంలో, ఆశించడంలో తప్పులేదు. మీ దగ్గర భవిష్యత్తుకు సరిపడా కాసులు ఉంటే ఖర్చు చేయడంలో కూడా తప్పులేదు.

కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే.. సొసైటీ ఏమనుకుంటుందోనన్న పిచ్చి భ్రమల్లో పడతారు చూడండి. లేదా పక్కోడు అలా చేశాడు.. మనం ఇంకా గ్రాండ్‌గా చేసి మన సత్తా ఏంటో చూపిద్దాం.. అంటూ పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు. మీ దగ్గర లేకున్నా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పెళ్లిళ్లు చేస్తారు. ఇక్కడే మొదలవుతుంది ఆర్థిక సమస్య.

కోవిడ్ కంటే ముందు గ్రాండ్‌గా చేయడం, లావిష్‌గా ఖర్చు చేయడం ఒక ప్రెస్టీజ్‌గా మారింది. కోవిడ్ అంతా భూగోళాన్ని ష...