భారతదేశం, ఫిబ్రవరి 5 -- త్రీ ఇడియ‌ట్స్ ఫేమ్ శ‌ర్మాన్ జోషి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మెడిక‌ల్ డ్రీమ్స్ వెబ్‌సిరీస్ యూట్యూబ్‌లో రిలీజైంది. కేవ‌లం ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను మాత్ర‌మే మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్‌, రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ వెబ్‌సిరీస్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

నీట్ ఎగ్జామ్స్ రాసి డాక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్న ఓ ప‌ల్లెటూరి యువ‌తి జ‌ర్నీ నేప‌థ్యంలో మెడిక‌ల్ డ్రీమ్స్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. కోచింగ్ కోసం కోటా రావాల‌ని ఆమె ఎందుకు అనుకుంది? పోటీప్ర‌పంచంలో ఇమ‌డ‌లేక ఆ యువ‌తి ఎలాంటి ఇబ్బందులు ప‌డింది? చివ‌ర‌కు త‌న క‌ల‌ను ఎలా నెర‌వేర్చుకుంది అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు అశుతోష్ పంక‌జ్ ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు.

ఈ సిరీస్‌లో నిన్హా అనే లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో శ‌ర్మాన్ జోషి క‌నిపించారు. ర‌...