భారతదేశం, ఆగస్టు 3 -- Wayanad landslides: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఆ ప్రకృతి విపత్తు జరిగి 5 రోజులైంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. శిధిలాల కింద ఇంకా రెండు వందల మంది ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తమ ఇళ్లను, ఆత్మీయులను కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక చర్యలు చేపట్టి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయి.

వయనాడ్ (Wayanad) జిల్లాలో కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వారి కోసం విరాళాలు సేకరించడానికి కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం "ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (Chief Minister's Disaster Relief Fund)"ని ప్రారంభించింది. సీఎం సహాయ నిధికి బ్యాంకు ఖాతా నంబరుతో సహా ప్రజలు విరాళాలు ఇవ్వగల వివిధ మార...