తెలంగాణ,వరంగల్, ఏప్రిల్ 6 -- వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్టు సెక్షన్ 30 అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీ సన్ ప్రీత్ సింగ్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ 30- సిటీ పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకొచ్చినట్టు సీపీ తెలిపారు.
సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం పోలీస్ ఆఫీసర్ల అనుమతి లేకుండా ఎలాంటి మీటింగులు, ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీలు లేదని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా, ముందస్తుగా పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా మీటింగులు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేగాకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ఇతర అస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.