భారతదేశం, మార్చి 3 -- Warangal News : కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతున్న ఓ తండ్రి.. ఏ పనీ చేయకుండా తిరుగుతున్న తన కొడుకును మందలించాడు. ఇల్లు గడవడం కష్టమవుతోందని, ఏదైనా పని చేయాల్సిందిగా చెప్పడంతో.. మనస్తాపానికి గురైన ఆ యువకుడు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడనుకున్న కొడుకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్ గంజ్ పీఎస్ పరిధి నిజాంపురలో చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మండి బజార్ ఏరియాలోని నిజాంపుర ప్రాంతానికి చెందిన యాకుబ్ ఖాన్ - జరీనా దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. యాకుబ్ ఖాన్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. రోజూ ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఆటో నడపడం...