భారతదేశం, మార్చి 6 -- Warangal Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్ట కూటి కోసం మిర్చి ఏరేందుకు ట్రాలీలో వెళ్తుండగా.. అదుపు తప్పి ఆ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ట్రాలీలో దాదాపు 50 మంది వరకు ఉండగా.. అందులో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండాకు చెందిన దాదాపు 50 మంది కూలీలు నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి మిర్చి ఏరేందుకని బయలు దేరారు. ఎండాకాలం కావడంతో పొద్దటి కూలి కోసమని ఉదయం ఆరు గంటల సమయంలోనే బయలు దేరగా.. చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో జీడిగడ్డ తండాకు చెందిన బానోతు సూక్య(55...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.