భారతదేశం, జనవరి 27 -- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 66 డివిజన్లు, 2.25 లక్షల వరకు ఇళ్లు ఉన్నాయి. 11 లక్షల వరకు జనాభా ఉంది. ప్రతి రోజు గ్రేటర్ వరంగల్ పరిధి నుంచి 450 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడి చెత్త వస్తోంది. 2007లో మడికొండ శివారులోని దాదాపు 32 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ డంప్ యార్డులో దాదాపు 7 లక్షల టన్నుల వరకు వ్యర్థాలు పోగయ్యాయి. అందులో 3 లక్షల టన్నుల వరకు చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 2021 లోనే రూ.36 కోట్లతో బయోమైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. కానీ ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రోజురోజుకు డంప్ యార్డులో చెత్త గుట్టలుగా పెరిగిపోతోంది.

డంప్ యార్డులో గతంలో పోగైన 3 లక్షల టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసే పనులు నడుస్తున్నాయి. కొత్తగా పోగవుతున్న చెత్తతో ...