భారతదేశం, మార్చి 17 -- టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మల్టీస్టారర్ స్పై యాక్షన్ మూవీకి క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. వార్‌కు సీక్వెల్‍గా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు అయాన్ ముఖర్జీ. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో వార్ 2 రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ కొన్నాళ్లుగా నెలకొంది. అయితే, విడుదల తేదీని యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించేసింది. అయితే, రజినీకాంత్ 'కూలీ' పోటీలో ఉంటుందా అనే అంశం ఇప్పుడు మరో చర్చలా మారింది.

వార్ 2 చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. ఆరోజున థియేటర్లలో విధ్వంసమే అంటూ పేర్...