భారతదేశం, మార్చి 24 -- వివో వై300 సిరీస్​లో మరో స్మార్ట్​ఫోన్​ని సంస్థ లాంచ్​ చేసేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఈ మోడల్​ పేరు వివో వై300 ప్రో ప్లస్​. ఈ నెల 31న చైనాలో ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతుందని పలు లీక్స్​ సూచిస్తున్నాయి. ఇక ఈ వివో వై300 ప్రో ప్లస్​కి సంబంధించిన కొన్ని ఫీచర్స్​ ఇప్పటికే లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వై300లో ఇప్పటికే 3 స్మార్ట్​ఫోన్స్​ అందుబాటులో ఉన్నాయి. అవి వివో వై300, వివో వై300 ప్రో, వివో వై300 ప్లస్​, వివో వై300ఐ. వివో వై300 ప్రో ప్లస్​తో పాటు వివో వై300 జీటీపైనా సంస్థ వర్క్​ చేస్తోంది.

ఇక వివో వై300 ప్రో ప్లస్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్​తో పనిచేస్తుందని, ఇది వై300 ప్రోలో కనిపించే స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 నుంచి అప్​గ్రేడ్ పొందుతుందని చైనా సోషల్​ మీడియా వీబోకు చెందిన టిప...